ఈరోజు (అక్షరవేకువ) జూలై 29
గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ముల్కల గాయత్రి విశ్వకర్మ శారద దేవి వేద పాఠశాలలో ఒక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రమౌలీశ్వర స్వామి, వారి కుమారులు విశ్వంభర శర్మ, పవన్ శాస్త్రి, విజయ శర్మలను ఘనంగా సత్కరించారు.
గురుపౌర్ణమి సందర్భంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో ముల్కల గాయత్రి విశ్వకర్మ శారద దేవి వేద పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చంద్రమౌలీశ్వర స్వామి గారికి, వారి కుమారులు విశ్వంభర శర్మ, పవన్ శాస్త్రి, విజయ శర్మ గార్లకు పూలమాలలు, శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్ రావు, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోటపలుకుల తిరుపతి, ఎండోమెంట్ కమిటీ బీజేపీ జిల్లా కన్వీనర్ శ్రీమన్నారాయణ, గర్మిళ్ల జోన్ అధ్యక్షులు అమీర్ శెట్టి రాజు పాల్గొన్నారు.
అలాగే, గర్మిళ్ల మహిళా మోర్చా అధ్యక్షురాలు బైరం లక్ష్మీ, కానగంటి రేవతి, బీజేవైఎం మండల నాయకులు మామిడాల సాగర్ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.












