మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 29
గురు పౌర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకొని మంచిర్యాలలోని సాయిబాబా దేవాలయంలో మేయర్ శ్రీ దర్ని మధుకర్, TPCC సభ్యులు నూకల రమేష్ గారితో కలిసి సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు.
గురు పౌర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకొని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కొత్త రోడ్ నందు గల సాయిబాబా దేవాలయంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ గారు, TPCC సభ్యులు నూకల రమేష్ గారితో కలిసి సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం దేవాలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించి సేవా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.
ఈ సందర్భంగా గురు పౌర్ణిమ ఆధ్యాత్మికత, సేవాభావానికి ప్రతీక అని పేర్కొన్న మేయర్ శ్రీ దర్ని మధుకర్ గారు, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వేల్పుల రవీందర్ గారు, 07వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చిలుక మల్లేష్, స్థానిక కాంగ్రెస్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.












