హజీపూర్, 2026-06-05
హాజీపూర్ మండలంలోని దోనబండ గ్రామంలో మండల ప్రత్యేక అధికారి, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి కిషన్ శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి, ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని ప్రజలకు సూచించారు.
హాజీపూర్ మండలంలోని దోనబండ గ్రామంలో మండల ప్రత్యేక అధికారి, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి కిషన్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను ఆయన పరిశీలించారు. ప్రజలు తప్పనిసరిగా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు.
గ్రామంలో నిత్యం పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కార్యదర్శి నరేందర్‌ను ఆదేశించారు. గ్రామంలో సేకరించిన చెత్తను సేంద్రియ ఎరువుగా మార్చే పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. నర్సరీ, స్మశాన వాటికలను కూడా ఆయన పరిశీలించారు.
అలాగే, నిత్యం పనులను నమోదు చేసే ప్రత్యేక యాప్ పనితీరును కూడా ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ సుమన్, కార్యదర్శి నరేందర్ తదితరులు పాల్గొన్నారు.












