హజీపూర్, 7 September
మండలంలోని జిల్లా రవాణా శాఖ కార్యాలయం దుస్థితి వాహనాదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. పట్టణానికి దూరంగా, పంట పొలాల మధ్య అద్దె భవనంలో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయానికి రావడానికి వాహనాదారులు జంకుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఒకేరోజు పనులు కావడం లేదని వాపోతున్నారు.
నిలబడలేం వాహనం నిలపలేం. జిల్లా రవాణా శాఖ కార్యాలయం దుస్థితి. హాజీపూర్ మండలం. జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి ఆదాయం భారీగా ఉన్న సరైన వసతులు లేక వాహనాదారులు అవస్థలు పడుతున్నారు పట్టణానికి దూరంగా విసిరేసినట్లుగా పంట పొలాల్లోని అద్దె భవనంలో ఏర్పాటుచేసిన కార్యాలయానికి వాహనాదారులు రావాలంటేనె జంకుతున్నారు సుధూర ప్రాంతం నుంచి పనుల కోసం వస్తే ఒకేరోజు పనులు కావడం లేదని వాపోతున్నారు వర్షాలతో కార్యాలయం ఆవరణలో నిండిన బురదతో కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలు నిలిపేందుకు స్థలం లేకుండా పోయింది జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి నిత్యం వందలాది మంది వాహనాలతో రాకపోకలు సాగించే జిల్లా రవాణా శాఖ కార్యాలయం ఇలా బురదగా ఉండటం తీవ్ర ఇబ్బందికరంగా మారింది. పట్టింపు కరువు. ప్రతిరోజు పెద్ద సంఖ్యలో వాహనాల రిజిస్ట్రేషన్ ధృవపత్రాల కోసం జనం వచ్చే కార్యాలయంలో కనీస వసతులు లేవు ఉన్నతాధికారులు పర్యవేక్షణ కురవాడ టంతో దిగువ స్థాయి అధికారులు సిబ్బంది వాహనదారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు లైసెన్సులు రిజిస్ట్రేషన్లు ఇతర పనుల కోసం వచ్చేవారు బురదలో వేచి చూడాల్సి వస్తుంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వర్షాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని సింగరేణి సంస్థతో పాటు సిమెంటు విద్యుత్తు తదితర కంపెనీలు ఉండటంతో నిత్యం అనేకమంది కార్యాలయానికి వివిధ పనులపై వస్తుంటారు కనీస వసతులు కల్పించక ఇబ్బందులు పడుతున్నారు వీటికి తోడు తరచూ సాంకేతిక సమస్యలతో పరిస్థితి మరింత అద్వానంగా మారింది. జిల్లాలో వాహనాలు ఆదాయ వివరాలు. మొత్తం వాహనాలు 2.46 లక్షలు. రిజిస్ట్రేషన్లు రోజుకు 25. లైసెన్సులు రోజుకు 30. ఫిట్నెస్లు రోజుకు 20. 2025 2026 లో ఆదాయం 65 కోట్లు.







