INTUC యూనియన్ సీనియర్ కేంద్ర నాయకుడు జెట్టి శంకర్ రావు, కార్మిక సంక్షేమానికి ఆయన చేసిన విశిష్ట సేవలకు గాను తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక "శ్రమ శక్తి అవార్డు"ను అందుకున్నారు. రాష్ట్ర కార్మిక మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా ఈ పురస్కారం ప్రదానం చేయబడింది.
నాలుగు దశాబ్దాలుగా కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న జెట్టి శంకర్ రావు, ఈ అవార్డు ద్వారా గుర్తింపు పొందారు. ఆయన నాయకత్వంలో అనేక కార్మిక సమస్యలు పరిష్కరించబడ్డాయని, వారి సంక్షేమానికి మెరుగైన చర్యలు చేపట్టబడ్డాయని యూనియన్ వర్గాలు తెలిపాయి.
శంకర్ రావు, తన సుదీర్ఘ ప్రస్థానంలో కార్మికులకు అండగా నిలుస్తూ, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన నిబద్ధత, సేవా దృక్పథం అనేక మందికి ఆదర్శంగా నిలుస్తున్నాయి.
ఈ సందర్భంగా, SRP బ్రాంచ్ INTUC శ్రేణులు, కార్మికులు, ఉద్యోగులు, మహిళా ఉద్యోగినిలు, ప్రజలు జెట్టి శంకర్ రావుకు అభినందనలు తెలిపారు. ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, కార్మిక వర్గానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.








