హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో 2026 మే డే వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొనగా, మందమర్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పుల్లూరి లక్ష్మణ్‌కు శ్రమశక్తి అవార్డును అందజేశారు.
కార్మిక మరియు గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట్ స్వామి, పర్యటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, బెల్లంపల్లి శాసనసభ్యులు వినోద్, పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీ ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్మికుల సేవలను గుర్తించి, వారి స్ఫూర్తిని చాటేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ వేడుకల్లో భాగంగా, మందమర్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా, డిసిసి జనరల్ సెక్రెటరీగా సేవలందిస్తున్న పుల్లూరి లక్ష్మణ్‌ను శ్రమశక్తి అవార్డుతో సత్కరించారు. మంత్రి గడ్డం వివేక్ వెంకట్ స్వామి చేతుల మీదుగా పుల్లూరి లక్ష్మణ్‌కు జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని అందించి ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో DCC సెక్రటరీ గోపతి భానేష్, జిల్లా సేవాదళ్ ఉపాధ్యక్షుడు MD పాషా, పైడిమల్ల నర్సింగ్, సంఘీ సంతోష్, బండి శంకర్, కొలిపాక సదానందం, సామ్యూల్, సుద్దాల రాజ్ కుమార్, మహంత్ అర్జున్, MD. నయీమ్, రాయబారపు కిరణ్, గడ్డం మహేష్, సుమంత్, వర్షిత్ వంటి పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్మికుల సమస్యలు, వారి హక్కులపై ఈ సందర్భంగా చర్చలు జరిగినట్లు తెలిసింది.











