అందోల్, 7 September
జోగిపేట తహసీల్దార్ కార్యాలయం వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంలో మున్సిపల్ చైర్మన్ ఎస్.కృష్ణారెడ్డి కొబ్బరికాయ కొట్టి భూమి పూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సంగారెడ్డి జిల్లా అందోల్–జోగిపేట మున్సిపల్ పరిధిలో నూతన ఆర్డీవో కార్యాలయ నిర్మాణానికి సోమవారం భూమిపూజ నిర్వహించారు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు జోగిపేట తహసీల్దార్ కార్యాలయం వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంలో మున్సిపల్ చైర్మన్ ఎస్.కృష్ణారెడ్డి కొబ్బరికాయ కొట్టి భూమి పూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రూ.3.83 కోట్ల వ్యయంతో జీ+1 అంతస్తులతో ఆర్డీవో కార్యాలయ భవనం, రెసిడెన్షియల్ క్వార్టర్స్ నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ కార్యాలయం అందుబాటులోకి వస్తే ప్రజలకు పరిపాలనా సేవలు మరింత చేరువ కానున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు), జగన్ మోహన్‌రెడ్డి, సురేందర్‌గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ గూడెం మల్లయ్య, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు పడిగే సత్యం, తహసీల్దార్ మధుకర్‌రెడ్డి, ఆర్అండ్బీ శాఖ అధికారులు డీఈ రవీందర్, ఏఈ శశాంక్, కౌన్సిలర్లు కోషికే రాజశేఖర్, మర్రి అరుణకుమారి, మాజీ కౌన్సిలర్లు దుర్గేష్, హరికృష్ణగౌడ్, ప్రదీప్‌గౌడ్, నాగరాజు, అల్లే శ్రీకాంత్, పిట్ల లక్ష్మణ్, తుపాకుల సునీల్‌కుమార్, కో-ఆప్షన్ సభ్యుడు డేవిడ్, మాజీ అందోల్ సర్పంచ్ శ్రీనివాస్, మాజీ వార్డు సభ్యుడు పట్లోళ్ల ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బేగరి అనిల్‌కుమార్, గుర్రం కృష్ణ, మాసానిపల్లి మాజీ సర్పంచ్ అశోక్, నాయకులు కృష్ణ, గూడెం చందు, మోదీని రాజు తదితరులు పాల్గొన్నారు.












