మంచిర్యాల (అక్షరవేకువ) సెప్టెంబర్ 01
మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ఆదివాసి కోయ సంఘం జిల్లా కమిటీ ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. ఈ ఎన్నికలో భాగంగా నస్పూర్ మండలం అరుణక నగర్‌కు చెందిన ఆర్కా రాజారాంకు మంచిర్యాల జిల్లా జాయింట్ సెక్రెటరీ పదవిని కేటాయించారు.
మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్లో ఆదివాసి కోయ సంఘం జిల్లా కమిటీ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా నస్పూర్ మండలం అరుణక నగర్‌కు చెందిన ఆర్కా రాజారాంను మంచిర్యాల జిల్లా జాయింట్ సెక్రెటరీగా నియమించారు. ఈ పదవి తనకు ఇచ్చినందుకు, తనపై నమ్మకం ఉంచినందుకు గౌరవ అధ్యక్షులు నైతం లక్ష్మణ్, జిల్లా అధ్యక్షులు చెడంక మాంతయ్య, ప్రధాన కార్యదర్శి మడ సమ్మయ్యలకు ఆర్కా రాజారాం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.











