14వ డివిజన్ (పాత మంచిర్యాల), Mancherial, Telangana (అక్షరవేకువ) సెప్టెంబర్ 13
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14వ డివిజన్లో గల శ్రీ రామాలయంశివాలయంభక్త ఆంజనేయ స్వామి దేవస్థానం ప్రాంగణంలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పి ఎస్ ఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14వ డివిజన్ (పాత మంచిర్యాల)లో పురాతనమైన పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ రామాలయం–శివాలయం–భక్త ఆంజనేయ స్వామి దేవస్థానం ప్రాంగణంలో దాదాపు రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రామాలయం వంటి పవిత్రమైన దేవస్థాన ప్రాంగణంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.. అనంతరం కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో తయారు చేసిన మట్టి వినాయక విగ్రహాలను ఎమ్మెల్యే భక్తులకు పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు.. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, స్థానిక కార్పొరేటర్ తూముల నరేష్ , ప్రజలు ఎమ్మెల్యే పి ఎస్ ఆర్ ను శాలువాతో సన్మానించారు.. ఈ కార్యక్రమంలో మేయర్ మధుకర్ మార్కెట్ కమిటీ చైర్మన్ బానేష్ కార్పోరేటర్లు తదితరులు పాల్గొన్నారు..









