శ్రీరాంపూర్, 14 September
మంచిర్యాల ఏసీపీ పరిధిలో గణపతి నవరాత్రులపై ప్రత్యేక నిఘా ఉంటుందని, శ్రీరాంపూర్, సిసి, దండేపల్లి, లక్షత్ పెట్ ప్రాంతాలలో 1000కి పైగా మండపాల పర్యవేక్షణ చేస్తామని, ప్రతి కదలికపై తమ దృష్టి ఉంటుందని ఏసీపీ రత్నపురం ప్రకాష్ సోమవారం స్పష్టం చేశారు.
మంచిర్యాల ఏసీపీ పరిధిలో గణపతి నవరాత్రులపై ప్రత్యేక నిఘా ఉంటుందని, శ్రీరాంపూర్, సిసి, దండేపల్లి, లక్షత్ పెట్ ప్రాంతాలలో 1000కి పైగా మండపాల పర్యవేక్షణ చేస్తామని, ప్రతి కదలికపై తమ దృష్టి ఉంటుందని ఏసీపీ రత్నపురం ప్రకాష్ సోమవారం స్పష్టం చేశారు.
ప్రతి మండపంలో సీసీ కెమెరాలు ఏర్పాటు తప్పనిసరి అని, ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తే సీసీ కెమెరా ఫోకస్ అయ్యేలా పెట్టాలని సూచించారు. నైట్ పెట్రోలింగ్, పోలీస్ బందోబస్తుతో పాటు త్రిబుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి చర్యలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.
మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని, గంజాయి సేవిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అనుమానితులైన 300 మంది నేరస్తులను బైండోవర్ చేశామని, నేర చరిత్ర కలిగిన వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు.
మతపరమైన విషయాలు కాబట్టి, దేవుడి మండపాల కమిటీ సభ్యులు ముగ్గురు తప్పనిసరిగా నిద్రించాలని, జూదం వంటి ఆటలు నిషేధమని యువత గమనించాలని సూచించారు. భజనలు, భక్తి పాటలకు ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారు. హరే కృష్ణ మఠం ద్వారా భజన గీతాలు, కోలాటాలు, నిమజ్జనంలో భక్తులు ఆడే విధంగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని సూచన చేశారు.
భక్తి పేరుతో విపరీత పోకడలు, విచిత్ర వైఖరి ప్రదర్శిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఏసీపీ స్పష్టం చేశారు. రాత్రి 10 గంటల తర్వాత అనుమానితుల సంచారం, అజ్ఞాత వ్యక్తుల కదలికలపై 100 నంబర్‌కు సమాచారం అందిస్తే తగు చర్యలు వేగంగా ఉంటాయని తెలిపారు.
రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ జా, మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ ఆదేశాలను ఎప్పటికప్పుడు పాటిస్తూ ముందుకు సాగుతామని చెప్పారు. ప్రతి పౌరుడు బాధ్యతగా స్పందించాలని, వినాయక నవరాత్రులు, నిమజ్జనం విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఏసీపీ ప్రకాష్ పిలుపునిచ్చారు.












