మంచిర్యాల అసెంబ్లీ పరిధి, మంచిర్యాల, తెలంగాణ (అక్షరవేకువ) సెప్టెంబర్ 06
మంచిర్యాల అసెంబ్లీ పరిధిలో గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలని, అందుకు అన్ని శాఖల సమన్వయం తప్పనిసరి అని, గణేష్ ఉత్సవ కమిటీ ప్రత్యేక శ్రద్ధతో పని చేయాలని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు స్పష్టం చేశారు. వినాయకులను ఏర్పాటు చేయాలనుకున్న మండపదారులు తప్పనిసరిగా ఈనెల 10 లోపు దరఖాస్తు అందించాలని, లేని పక్షంలో సెంటిమెంట్ తావివ్వకుండా వినాయకుని తొలగించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
మంచిర్యాలలో గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలి శాఖల సమన్వయం తప్పనిసరి గణేష్ ఉత్సవ కమిటీ ప్రత్యేక శ్రద్ధతో పని చేయాలి ఈనెల 10 వరకు దరఖాస్తులు అందించాలి ఆ తదుపరి వినాయకుని ఏర్పాటు మండపం చేయకూడదు ఈ నిబంధన తప్పనిసరి మంచిర్యాల అసెంబ్లీ పరిధిలో వినాయకులను ఏర్పాటు చేయాలనుకున్న మండపదారులు తప్పనిసరిగా ఈనెల 10 వరకు దరఖాస్తు అందించి మండపం ఏర్పాటు చేయాలని లేని పక్షంలో సెంటిమెంట్ తావివ్వకుండా వినాయకుని తొలగించాల్సి వస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు స్పష్టం చేశారు ఈ నిబంధన తప్పనిసరిగా ప్రతి ఒక్కరు పాటించాలన్నారు. అలాగే పోలీస్ శాఖ ఫైర్ శాఖ కార్పొరేషన్ శాఖ ఫిషరీస్ శాఖ ఎక్సైజ్ శాఖ ట్రాన్స్పోర్ట్ శాఖల సమన్వయం తప్పనిసరి అని ప్రతి ఒక్కరు నిబంధనలు అనుగుణంగా వినాయక నిమజ్జనాల ఏర్పాటుకు విద్యుత్ ఎక్సైజ్ ఫైర్ కార్పొరేషన్ సిబ్బంది చిత్తశుద్ధితో కృషి చేయాలని మంచిర్యాలకు ప్రతిష్టాత్మకంగా శాంతి నిమజ్జనం ఉత్సవాల నిర్వహణ పేరు రావాలని ఎమ్మెల్యే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిమజ్జనం చోట సింగరేణి గోదావరి సీతారాం పల్లి నిమజ్జనం ఏర్పాట్లు సింగరేణి సంస్థ చూడాలన్నారు అన్ని శాఖలు ముందస్తుగా ప్రమాద సామాగ్రి తో పాటు వాహనాలను మంత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచన చేశారు. అన్ని శాఖల పనితీరు మెరుగ్గా ఉండాలని ఆదేశించారు. ముఖ్యంగా గంజాయి సేవింపుదారులు మండపాల వద్ద 50 మీటర్ల పరిధిలో మద్యం సేవించిన వ్యక్తుల కేసులు నమోదు గొడవల కారణమయ్యే వ్యక్తులను బైండోవర్ చేయాలని చెప్పారు. 11 రోజుల నిమజ్జల కాలంలో కాటన్ల మద్యం ఇవ్వకుండా నిబంధన పాటించాలన్నారు 18 ఏళ్ల పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో మద్యం ఇస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు ఈ రికార్డులను ఎమ్మెల్యే పరిశీలిస్తా అధికారులకు కుండ బద్దలు కొట్టారు. పలు సూచనలు సలహాలు తగు జాగ్రత్తలు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంచిర్యాల మేయర్ మధుకర్ డిప్యూటీ మేయర్ సల్ల మహేష్, ఏసిపి ప్రకాష్ ట్రాన్స్కో ఎస్సీ రాజన్న అన్ని శాఖల అధికారులు కాంగ్రెస్ కార్పొరేషన్ సిటీ అధ్యక్షులు తూముల నరేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.












