మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 05
ఫీజు రియంబర్స్మెంటసమస్యపై రాష్ట్ర ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో ఈనెల 10వ తేదీన మంచిర్యాల జిల్లా కేంద్రంలో లడాయి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఫీజు రియంబర్స్మెంట్ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో ఈనెల 10వ తేదీన మంచిర్యాల జిల్లా కేంద్రంలో లడాయి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ రావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
నిరసన ర్యాలీ వివరాలు
గురువారం ఉదయం 10 గంటలకు బెల్లంపల్లి చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నిరసన లడాయి కార్యక్రమంలో జిల్లాలోని అన్ని మండలాల నుండి అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రఘునాథ్ రావు కోరారు.
ముఖ్య అతిథిగా గణేష్ కుంద్రా
ఈ కార్యక్రమానికి బీజేపీ యువజన విభాగం (బీజేపీవైఎం) రాష్ట్ర అధ్యక్షులు గణేష్ కుంద్రా ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఆయన సమక్షంలోనే రాష్ట్ర ప్రభుత్వంపై నిరసన రూపంలో లడాయి కార్యక్రమం నిర్వహించబడుతుందని పేర్కొన్నారు.












