మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 05
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తనపై వస్తున్న అవినీతి ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, తనపై కొందరు ప్రజా ప్రతినిధులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆర్థిక ఆరోపణలపై వివరణ ఇస్తూ, త్వరలో కుట్రలన్నీ బయటపెడతానని హెచ్చరించారు.
తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తీవ్రంగా ఖండించారు. సాక్షిలో వచ్చిన కథనాలను ఖండిస్తున్నానని, తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని తెలిపారు. తనపై ఉమ్మడి ఆదిలాబాద్ ప్రజా ప్రతినిధులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, సొంత పత్రిక కాకుండా ఇతర పత్రికల్లో తనపై తప్పుడు వార్తలు రాయిస్తున్నారని ఆరోపించారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని వదిలిపెట్టబోనని, త్వరలో కుట్రలన్నీ బయటకు వస్తాయని అన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న వారు చర్చలకు రావాలని సవాలు విసిరారు.
ఆర్థిక ఆరోపణలపై వివరణ
తాను 450 కోట్లు వాడుకున్నట్లు చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని స్పష్టం చేశారు. 2009-10లో బ్యాంక్ 450 కోట్లు సాంక్షన్ చేసిందని, సాయినాథ్ ప్రయివేట్ లిమిటెడ్, భాగ్యనగర్ హోటల్స్ పేరుమీద బ్యాంక్ లోను తీసుకున్నామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా తాను 15 స్కూల్స్ కట్టించానని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా తాను అధికార దుర్వినియోగం చేయలేదని, తాను సాండ్, ల్యాండ్ తీసుకోవాలనుకుంటే అప్పుడే తీసుకునేవాడినని తెలిపారు.
పత్రికలపై లీగల్ యాక్షన్
తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న పత్రికలపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించారు. తాను బేస్ లెస్ ఫిర్యాదు చేయనని అన్నారు. తాను పది ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి కాంగ్రెస్ కోసం పోరాటం చేశానని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే తాను సాండ్, మట్టి మాఫియా చేయలేదని అన్నారు. ట్రేడింగ్ డౌన్ అయిన తర్వాత తాను 160 కోట్లు లాస్ అయ్యానని వివరించారు.
నిజ నిర్ధారణ కమిటీకి హామీ
నిజ నిర్ధారణ కమిటీ వేస్తే, కమిటీ ముందు పూర్తి ఆధారాలు చూపిస్తానని అన్నారు. 450 కోట్లు ప్రాడ్ చేస్తే బ్యాంక్ 109 కోట్లకు ఎలా ఆక్షన్ వేస్తుందని ప్రశ్నించారు. సాంక్షన్ ఆర్డర్స్ తాను క్రియేట్ చేసినవి కావని తెలిపారు. 2014 నుండి 2025 వరకు కంపెనీకి ఫండ్స్ వాడింది 109 కోట్ల 11 లక్షలని వివరించారు. అన్ని బ్యాంకులు ఇచ్చింది 109 కోట్ల 11 లక్షలని తెలిపారు. , బ్యాంకుల నుండి లోను తీసుకున్నామని వివరించారు. 2014 నుండి 2025 వరకు 44 కోట్ల 81 లక్షల పేమెంట్ చేశామని తెలిపారు. 168 కోట్లు 2014-15 లో రీజర్వ్ ప్రైస్ ఉందని తెలిపారు. ఆంధ్ర బ్యాంక్ అయిన తర్వాత 18 కోట్ల 72 లక్షలు చెల్లించామని తెలిపారు. 2024 అక్టోబర్ 31 నుండి పేమెంట్ చేశామని తెలిపారు.
రాజకీయ కుట్ర ఆరోపణలు
తన జిల్లా నేతలు తనపై కుట్ర చేశారని ఆరోపించారు. మంత్రి పదవి చర్చ వచ్చిన ప్రతిసారీ ఇలాంటి వార్తలు వస్తున్నాయని అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై ఎక్కడ చర్చకైనా సిద్ధమేనని తెలిపారు.











