మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 29
మంచిర్యాల జిల్లాలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ శ్రీనివాస్ల జిల్లా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మార్పీఎస్ మంచిర్యాల జిల్లా ఇన్చార్జి లింగంపల్లి శ్రీనివాస్ మాదిగ, రాబోయే 40 రోజులలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ మరియు అనుబంధ సంఘాల గ్రామ, మండల నూతన కమిటీల నిర్మాణం పూర్తి చేయాలని పిలుపునిచ్చారు.
రాబోయే 40 రోజులలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ మరియు అనుబంధ సంఘాల గ్రామ, మండల నూతన కమిటీల నిర్మాణం పూర్తి చేయాలని ఎమ్మార్పీఎస్ మంచిర్యాల జిల్లా ఇన్చార్జి లింగంపల్లి శ్రీనివాస్ మాదిగ పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లాలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీల జిల్లా సమావేశం స్థానికంగా జరిగింది. ఈ సమావేశాన్ని సుందిల్ల మల్లేష్ మాదిగ సమన్వయం చేశారు.
సెప్టెంబర్ 9న వరంగల్లో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీల జాతీయ సమావేశం పద్మశ్రీ గౌరవ మంద కృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు జరుగుతుందని, ఆ సమావేశంలోపు జిల్లాల్లో ఉన్న ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకులు, మండల ఇన్చార్జీలు పూర్తిస్థాయి సమయం వెచ్చించి గ్రామ, మండల కమిటీలను పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు.
రాబోయే రోజుల్లో మత దురాహంకారం, కుల వివక్షత, సాంఘిక అసమానతలు లేని సమ సమాజ నిర్మాణం కోసం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఉద్యమించాల్సిన అవసరం ఉందని, పేదల పక్షాన ప్రతిఘటన పోరాటాలు చేయాల్సి వస్తుందని అన్నారు.
ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు సుందిల్ల మల్లేష్ మాదిగ, ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు రాజా గటయ్య మాదిగ, గౌరవ అధ్యక్షులు రాసపేల్లి రవి, ఎంఈఎఫ్ ప్రధాన కార్యదర్శి ఆవునురి తిరుపతి మాదిగ, కోశాధికారి ఆంజనేయులు మాదిగ, ఎమ్మార్పీఎస్ మంచిర్యాల నియోజకవర్గ ఇన్చార్జి చిప్పకూర్తి మల్లేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ చెన్నూరు నియోజకవర్గ ఇన్చార్జి జలంపల్లి శ్రీనివాస్ మాదిగ, ఎమ్మార్పీఎస్ సివియర్ నాయకులు మంతెన మల్లేష్ మాదిగ, చుంచు శంకర్ వర్మ మాదిగ, మల్లరాపు చిన్న రాజాం మాదిగ, మిట్టపల్లి మల్లయ్య మాదిగ, రాత్నం ఐలయ్య మాదిగ, నక్క అంజన్న మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు వేల్పుల సతీష్ మాదిగ, జీడి సారంగం మాదిగ, జిలకర శంకర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.












