మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 09
షఒ.భొ500ననషఉధషఘనథ.ఈష.
రాష్ట్ర రాజకీయాల్లో మంచిర్యాల అసెంబ్లీ ఒక కీలక వేదికగా మారింది. ఈ నేపథ్యంలో, రెండున్నరేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు 500 కోట్ల అక్రమ సంపాదనతో బ్యాంకు అప్పులు తీర్చారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథరావు ఆరోపించారు. ఈ ఆరోపణలు రాష్ట్ర మీడియాలో వైరల్ అయ్యాయి.
ఆరోపణల ఖండన
దీనిపై స్పందించిన మంచిర్యాల ఎమ్మెల్యే, గాంధీ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆరోపణలను ఖండించారు. అనంతరం, మంచిర్యాలలోని ఎంకన్వెన్షన్ సెంటర్లో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర నాయకులు విజిత్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా, ఎమ్మెల్యే చెల్లించినట్లు చెబుతున్న444 కోట్ల లెక్కలను, బ్యాంకులకు చెల్లింపుల విధానాలను బయటపెట్టారు.
వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే
ఈ విషయం మంచిర్యాల జిల్లా అంతటా వైరల్ కావడంతో, ఎమ్మెల్యే ప్రేమ్ నార్త్ ఇన్ హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలను స్పష్టం చేశారు. 450 కోట్ల రుణానికి బ్యాంకులను సంప్రదించగా, కేవలం 109 కోట్లు మాత్రమే తీసుకున్నానని, ఈ నిధుల సేకరణ నాలుగు బ్యాంకుల ద్వారా జరిగిందని ఆయన వివరించారు. వడ్డీతో కలిపి మొత్తం 195 కోట్లు తిరిగి చెల్లించానని, అందులో 45 కోట్ల 16 లక్షలు, రెండు కంపెనీల సహాయంతో మరో 75,75 కోట్లు చెల్లించినట్లు వివరాలను బహిరంగపరిచారు.
బీజేపీ, బీఆర్ఎస్ నేతల స్పందన
ఇదిలా ఉండగా, 500 కోట్ల అవినీతి, అక్రమాల ఆరోపణలపై బీజేపీ నేత రఘునాథ్ స్పందించాల్సి ఉంది. 444 కోట్ల బ్యాంకు రుణాల వివరాలను బయటపెట్టిన బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్, విజిత్ రావు కూడా స్పందించాల్సి ఉంది.
బహిరంగ చర్చకు సవాల్
కేవలం 109 కోట్ల రుణానికి వడ్డీతో కలిపి 195 కోట్లు చెల్లించానని ఎమ్మెల్యే పిఎస్ఆర్ చెబుతున్నారు. ఈ విషయాన్ని నిరూపించడానికి బహిరంగ చర్చకు సిద్ధమని మంచిర్యాల ఎమ్మెల్యే పిఎస్ఆర్ సవాల్ విసిరారు.
రాజకీయ పరిణామాలు
అసెంబ్లీలో బ్యాంకు రుణాలపై చర్చ రసవత్తరంగా మారింది. మూడు పార్టీల రాజకీయాలు, ఆరోపణలు, విమర్శలు ఎలాంటి మలుపు తీసుకుంటాయో వేచి చూడాలి.











