మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ పథకం కింద జరుగుతున్న ఆధునీకరణ పనులను ఎంపీ వంశీ మంగళవారం పరిశీలించారు. ప్రయాణికుల సౌకర్యార్థం మెరుగైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
సుమారు రూ. 26.49 కోట్ల వ్యయంతో రైల్వే స్టేషన్లో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని అధికారులు ఎంపీకి వివరించారు.
పనుల పురోగతిని సమీక్షించిన ఎంపీ, ప్రయాణికుల భద్రత, వృద్ధులు, దివ్యాంగులకు కల్పించాల్సిన సౌకర్యాలు, లైటింగ్, వెయిటింగ్ హాల్స్, తాగునీటి సరఫరా వంటి అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
అవసరమైన ఏర్పాట్లను సమర్థవంతంగా చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఈ పనుల వల్ల ప్రయాణికుల కష్టాలు తీరాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఏ. భాస్కర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.








