మందమర్రి పట్టణంలో వరుస ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి, 4 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
మందమర్రి పోలీసులు బుధవారం ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి సుమారు లక్షల విలువైన 4 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
శాంతినగర్‌కు చెందిన గటాడి లక్ష్మీనారాయణ (48), పెట్రోల్ పంపులో పనిచేస్తూ, డబ్బు సంపాదించాలనే దురాశతో దొంగతనాలు చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. సులభంగా దొరికే, తాళం వేయని లేదా నిర్లక్ష్యంగా పార్క్ చేసిన బైక్‌లను లక్ష్యంగా చేసుకునేవాడు.
గత కొంతకాలంగా పట్టణంలో జరుగుతున్న బైక్ దొంగతనాలపై బాధితుల ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసుల నమోదు చేసి, ప్రత్యేక నిఘా పెట్టారు. బుధవారం అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, దొంగతనాలు బయటపడ్డాయి.
నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు నాలుగు వేర్వేరు కేసులకు సంబంధించిన 4 బైకులను రికవరీ చేశారు. వాహనదారులు తమ వాహనాలను సురక్షితమైన ప్రదేశాలలో పార్క్ చేయాలని, అదనపు లాకులు వేసుకోవాలని పోలీసులు సూచించారు.











