మందమర్రి, 14 September
తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో నాయకుడిగా, పార్టీ పట్టణ అధ్యక్షుడిగా పనిచేసిన జె. రవీందర్ అకాల మరణం పట్ల పలువురు నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాప సభలో నివాళులర్పించారు.
మందమరి గులాబీ పార్టీ రవీందర్ కు ఘన నివాళి నేతలు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో JAC నాయకుడిగా, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడిగా ప్రజా ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించిన జె. రవీందర్ అకాల మరణం చెందడం తీవ్ర దిగ్భ్రాంతికరం. ఈ సందర్భంగా వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర మాజీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పుస్కూరి రామ్ మోహన్ రావు బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య అనంతరం నిర్వహించిన సంతాప సభలో పాల్గొని నివాళులు అర్పించారు.. ఈ కార్యక్రమంలో మండల BRS నాయకులు మేడిపల్లి సంపత్ , హాజీపూర్ సర్పంచ్ మాధవరపు శ్రీలత రామారావు ,మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పల్లె భూమేష్ ,WCDSC మాజీ చైర్మన్ అత్తి సరోజ , సీనియర్ నాయకులు ఎడ్ల శంకర్ ,కర్రె ఉమాదేవి , నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






