PMSHRI తెలంగాణ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్, మందమర్రిలో 15 రోజుల పాటు జరిగే 'సమ్మర్ క్యాంప్ – 2026' కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా ప్రారంభించారు. ఈ శిబిరం విద్యార్థుల్లో సృజనాత్మకత, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్నారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మండల తహసీల్దార్ సతీష్ కుమార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేశ్వర్, మండల విద్యాధికారి రాతోడ్ రమేష్, AAPC చైర్మన్లు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. మండలంలోని వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సమ్మర్ క్యాంప్ మే 11 నుండి మే 25 వరకు కొనసాగుతుంది. ఆర్ట్ & క్రాఫ్ట్, డాన్స్, యోగా, స్టిచింగ్, ఇండోర్ గేమ్స్ వంటి పలు వినూత్న కార్యక్రమాలు విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరచడానికి నిర్వహించబడనున్నాయి.
విద్యార్థుల సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం మరియు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడమే ఈ శిబిరం ముఖ్య ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.









