మంచేరియల్, 2026-11-26
మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేసేందుకు వెంటనే స్థలం కేటాయించి, కౌన్సిల్లో అధికారిక తీర్మానం చేయాలని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి నరెడ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బీసీ సమాజ్ ఆధ్వర్యంలో మేయర్‌కు వినతిపత్రం సమర్పించారు. గత పదేళ్లుగా ఈ విగ్రహ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నా ఫలితం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సామాజిక సమానత్వం, బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక అయిన మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేసేందుకు వెంటనే స్థలం కేటాయించి, కౌన్సిల్లో అధికారిక తీర్మానం చేయాలని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బీసీ సమాజ్ ఆధ్వర్యంలో మేయర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లుగా పూలే విగ్రహ ఏర్పాటుకు వివిధ సందర్భాల్లో విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ, ఇప్పటివరకు అనుమతులు, అధికారిక తీర్మానం జరగకపోవడం విచారకరమన్నారు. కుల వివక్ష నిర్మూలన, మహిళా విద్య, సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు.
విద్య ద్వారానే సమాజంలో సమూల మార్పు సాధ్యమని నిరూపించిన పూలే ఆశయాలు భావితరాలకు స్ఫూర్తినిచ్చేలా మంచిర్యాల పట్టణంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. రాబోయే కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాన్ని అజెండాలో చేర్చి, అనువైన స్థలాన్ని కేటాయిస్తూ విగ్రహ ఏర్పాటుకు అనుకూలంగా తీర్మానం చేయాలని మేయర్, పాలకవర్గాన్ని కోరారు.
పూలే విగ్రహ ఏర్పాటు అనేది కేవలం విగ్రహ ప్రతిష్ఠాపన మాత్రమే కాదని, సామాజిక న్యాయం, సమానత్వం, బహుజన ఆత్మగౌరవానికి ఇచ్చే గౌరవమని ఆయన పేర్కొన్నారు. పదేళ్లుగా కొనసాగుతున్న విజ్ఞప్తికి ఇప్పటికైనా సానుకూల స్పందన లభించి కార్యరూపం దాల్చాలని నరెడ్ల శ్రీనివాస్ కోరారు.
ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘ రాష్ట్ర నా...






