మంచిర్యాల (అక్షరవేకువ) నవంబర్ 21
ముదిరాజ్ మహాసభ 12వ ఆవిర్భావ దినోత్సవం, ప్రపంచ మత్స్యకార దినోత్సవం పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామ్‌నగర్ పెద్దమ్మ గుడి వద్ద ముదిరాజ్ మహాసభ 12వ ఆవిర్భావ దినోత్సవం, ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గరిగంటి కొమురయ్య, రాష్ట్ర కార్యదర్శి దబ్బెట తిరుపతి మాట్లాడుతూ.. ముదిరాజుల అభ్యున్నతి, సాధికారత, హక్కుల సాధన, రాజకీయ చైతన్యం కోసం శాసన మండలి డిప్యూటీ చైర్మన్, మహాసభ వ్యవస్థాపకులు బండ ప్రకాష్ ఈ సంఘాన్ని స్థాపించారని తెలిపారు. ముదిరాజులను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలనే ప్రధాన డిమాండ్‌తో పోరాటం కొనసాగుతోందని, ప్రభుత్వ జాప్యంపై సంఘ పెద్దల నిర్ణయాలకు అనుగుణంగా జాతి ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని వారు తెలిపారు.
రాష్ట్రంలో సుమారు 40 లక్షల జనాభా, 14 శాతం వాటా కలిగిన ముదిరాజులకు హక్కులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో జనాభా దామాషా ప్రకారం న్యాయం జరగాలని వారు డిమాండ్ చేశారు.
మత్స్యకారుల సంక్షేమం కోసం సంఘాల సంఖ్యను 3 నుంచి 500 వరకు పెంచడంతో పాటు, చేపల వృత్తికి అవసరమైన పనిముట్లు, వలలు, ఇతర సామగ్రి, 62 500ద్విచక్ర వాహనాలు, 4 వేల మూడు చక్రాల వాహనాలు, వందలాది వ్యాన్లను అందించి మత్స్యకారుల ఉపాధికి తోడ్పాటునందించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమాలకు మహాసభ వ్యవస్థాపకులు బండ ప్రకాష్ సహకారం అందించారని వారు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో యువత జిల్లా అధ్యక్షులు గరిగె సుమన్, గరిగంటి సరోజ, తూటి రమేష్, నూనె రాజేశం, పంబల పోషం, మంద రమేష్, కోలిపాక తిరుపతి, కొలిపాక తిరుపతి, ఐలవేని కన్నయ్య, చుక్క మల్లేష్, షెనవెన పోషం, రాక్వార్ రాజు తదితరులు పాల్గొన్నారు.


