నారాయణఖేడ్, 8 September
బచావోడిపో డీహెచ్డబ్ల్యూ బచావోడిపో కె.ం, డీహెచ్డబ్ల్యూ బస్టాండ్లో
బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా నారాయణఖేడ్ పట్టణంలో మహిళలు, బాలికల సంక్షేమం, ఆరోగ్యం, భద్రత, సాధికారతపై పలు కార్యక్రమాలు నిర్వహించారు. న్యూ బస్టాండ్లో తల్లుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మదర్ బ్రెస్ట్ ఫీడింగ్ జిల్లా సంక్షేమ అధికారి కె.లలితాకుమారి ప్రారంభించారు. ప్రయాణ సమయంలో తల్లులు తమ చిన్నారులకు గోప్యతతో తల్లిపాలు అందించేందుకు ఈ గది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆమె తెలిపారు. అనంతరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో విద్యార్థినులకు శానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేసి, రుతుక్రమ పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. బాలికలు ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ పరిశుభ్రత పాటించాలని, పోషకాహారం తీసుకోవాలని సూచించారు. కేజీబీవీ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం హనుమంతరావుపేట్ అంగన్వాడీ కేంద్రాలను అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటరెడ్డి, సీడీపీఓ ఎన్.సుజాత, డీహెచ్ఈడబ్ల్యూ సమన్వయకర్త పల్లవి, సఖి కోఆర్డినేటర్ కల్పన, ఎంపీడీఓ రత్నవేణి, డిపో మేనేజర్ సాయి సుబ్రహ్మణ్యం, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












