మంచిర్యాల (అక్షరవేకువ) నవంబర్ 27
మంచిర్యాల జిల్లాలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన మండల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి, రికార్డులు, పథకాల అమలు తీరును సమీక్షించారు. అనంతరం వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమావేశమయ్యారు.
పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను నిర్దేశిత విధివిధానాలకు అనుగుణంగా త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మంచిర్యాల మండల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి, రికార్డులు, పెండింగ్ దరఖాస్తులు, వివిధ ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించి, రెవెన్యూ అంశాల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ పరిధిలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను నిబంధనలకు లోబడి పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. హైకోర్టు కేసులకు సంబంధించి సి.సి.ఎం.ఎస్. స్థితిగతులు, ఎ.ఎస్.డి.డి. రోజువారీ నివేదికల పరిష్కారం, భూభారతి పాత, కొత్త పెండింగ్ దరఖాస్తులు, జీ.ఓ.ఎం.ఎస్. నం. 58, 59 క్రింద భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తులు, భూదాన్ భూములు, మీ-సేవ ధృవీకరణ పత్రాల పెండింగ్ దరఖాస్తులు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులు, ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై వేగవంతమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ, ప్రతి అంశంపై ప్రత్యేక దృష్టి సారించి పెండింగ్ పనులను పూర్తి చేయాలని సూచించారు.
అనంతరం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో ఉన్న జిల్లా అదనపు కలెక్టర్ ఛాంబర్ లో, వానాకాలం 2026-27 సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా పౌరసరఫరాల అధికారి వేణుగోపాల్, జిల్లా మేనేజర్ శ్రీకళ, జిల్లా సహకార అధికారి కరుణాకర్, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్, డి.సి.ఎం.ఎస్. లతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, వానాకాలం 2026-27 ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పూర్తి చేసి, కొనుగోలు ప్రక్రియ సజావుగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాలలో అవసరమైన సదుపాయాలు కల్పించాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, రైతులకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


