వివరాల్లోకి వెళితే, 2010లో శ్రీలంక సైన్యం ఆ ఇంటిని కూల్చివేయడంతో ప్రస్తుతం అక్కడ ఖాళీ స్థలం మాత్రమే మిగిలి ఉంది.
వివరాల్లోకి వెళితే, 2010లో శ్రీలంక సైన్యం ఆ ఇంటిని కూల్చివేయడంతో ప్రస్తుతం అక్కడ ఖాళీ స్థలం మాత్రమే మిగిలి ఉంది. తిరుమావళవన్, శ్రీలంక తమిళ నాయకుడు ఎం.కె. శివాజిలింగం అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళ్లిన సందర్భంగా ఈ సందర్శన చేశారు. అనంతరం ఆయన చెమ్మణి సామూహిక సమాధుల ప్రాంతాన్ని కూడా సందర్శించారు. అయితే, ఆయన పర్యటనపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు కారణమైన ఎల్టీటీఈ అధినేతతో సంబంధం ఉన్న ప్రాంతాన్ని సందర్శించడం ఆయనను అవమానించడమేనని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ వ్యవహారంపై, విజయ్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ కూడా స్పందించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ప్రస్తుతం కాంగ్రెస్ ఈ వివాదంపై బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి కాంగ్రెస్, వీసీకే మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ఈ ఘటన అధికార కూటమిలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.


