కరీంనగర్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయంలో లా విద్యార్థిని చంద్రకళ మృతి కేసులో పోలీసులు కీలక చర్య తీసుకున్నారు. ఆమెను ప్రేమ పేరుతో మోసం చేసి, పెళ్లికి నిరాకరించాడనే ఆరోపణలతో మంచిర్యాల జిల్లాకు చెందిన హరికృష్ణను అరెస్ట్ చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
జిల్లా షాద్‌నగర్‌కు చెందిన దెక్కలి చంద్రకళ (30) శాతవాహన విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. విశ్వవిద్యాలయ మహిళా హాస్టల్లో ఉంటున్న ఆమె న తన గదిలో మృతదేహంగా కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
చంద్రకళ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. 2024లో హైదరాబాద్‌లో కంప్యూటర్ శిక్షణ పొందుతున్న సమయంలో ఆమెకు మంచిర్యాల జిల్లాకు చెందిన హరికృష్ణ పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారిందని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను లైంగికంగా వేధించాడని చంద్రకళ తండ్రి ఆరోపించారు. అనంతరం పెళ్లికి నిరాకరించడంతో చంద్రకళ తీవ్ర మనస్తాపానికి గురైందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కొత్తపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హరికృష్ణను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. చంద్రకళ మృతికి దారితీసిన పరిస్థితులపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా, విద్యార్థిని మృతిపై విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశాయి. విశ్వవిద్యాలయ హాస్టళ్ల పర్యవేక్షణలో నిర్లక్ష్యం జరిగిందని ఆరోపించాయి.
మరోవైపు, విశ్వవిద్యాలయ ఉపకులపతి, రిజిస్ట్రార్ చంద్రకళ కుటుంబానికి మానవతా దృక్పథంతో రూ.1.50 లక్షల ఆర్థిక సాయం అందించారు. అదనంగా మరో రూ.2 లక్షలు అందించడంతో పాటు, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.











