మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 27
మచ,ఠశతగతఅజశ.మజఎత,గఈమగొఅమైగ,,జమచశ.
రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణం ప్రభుత్వ బాలుర పాఠశాల, నస్పూర్ పట్టణం తీగల్ పహాడ్ పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు స్కూల్ కిట్స్ అందించే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మాజీ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, రఘునాథ్ వెరబెల్లి గారు హాజరై విద్యార్థులకు బ్యాగ్, నోట్ బుక్స్, జామెట్రీ బాక్స్ వంటి స్కూల్ కిట్స్ అందజేశారు.
విద్యార్థులు జీవిత లక్ష్యాలను ఎంచుకోవడానికి పదవ తరగతి పునాది లాంటిదని, విద్యార్థులు ఇప్పుడే జీవిత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధనకు కృషి చేయాలని వెంకటేష్ నేత గారు సూచించారు. ఉన్నత విద్యతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత విద్యను అభ్యసించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని రఘునాథ్ గారు విద్యార్థులకు సూచించారు.











