మందమర్రిలోని ఆర్.పి.ఐ (అత వాలే) పార్టీ కార్యాలయంలో శనివారం నాడు జరిగిన సమావేశంలో మంచిర్యాల జిల్లా నూతన అధ్యక్షుడిగా దూడెం తిరుపతిని నియమించారు. ఈ మేరకు పాత కమిటీని రద్దు చేసినట్లు పార్టీ నాయకులు తెలిపారు.
ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగపిండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన సమక్షంలోనే దూడెం తిరుపతిని జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించారు. సీనియర్ నాయకులు రమేష్‌ను శాలువాతో సత్కరించారు.
తుంగపిండి రమేష్ మాట్లాడుతూ, పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త తమ శక్తి మేరకు కృషి చేయాలని సూచించారు. ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
నూతన జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన దూడెం తిరుపతికి నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం తిరుపతి మాట్లాడుతూ, తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తానని హామీ ఇచ్చారు.












