సంగారెడ్డి, 2026-11-25
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కుమారుడు సాయి భరత్ రెడ్డి - పాలక్ వివాహ వేడుక సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పోలీస్ కృష్ణ ప్రత్యేక కానుకను అందజేశారు. సంగారెడ్డిలోని జగ్గారెడ్డి నివాసంలో సాయి భరత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి రూ.3లక్షల44వేల విలువైన బంగారు కడియాన్ని బహూకరించి, వివాహ శుభాకాంక్షలు తెలిపారు. నూతన జీవితంలోకి అడుగుపెడుతున్న సాయి భరత్ రెడ్డికి సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని పోలీస్ కృష్ణ ఆకాంక్షించారు.

