సదాశివపేట, 2026-09-13
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నిజాంపూర్ కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు డా. రామకృష్ణ పోట్రు ప్రతిష్టాత్మక మహాత్మా గాంధీ విద్యారత్న నేషనల్ అవార్డు - 2026కు ఎంపికయ్యారు. ఈ అవార్డును హైదరాబాద్ లోని శ్రీ త్యాగరాయ గానసభలో జరిగే కార్యక్రమంలో ప్రదానం చేయనున్నారు.
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నిజాంపూర్ కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు డా. రామకృష్ణ పోట్రు ప్రతిష్టాత్మక మహాత్మా గాంధీ విద్యారత్న నేషనల్ అవార్డు - 2026కు ఎంపికయ్యారు. భారత ప్రభుత్వ నీతి అయోగ్ గుర్తింపు పొందిన, మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకల సందర్భంగా హైదరాబాద్, చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభ, కళా సుబ్బారావు కళా వేదిక హాల్ లో న జరిగే అవార్డుల ప్రధానోత్సవంలో ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు. విద్యా రంగంలో వారు చేసిన విశిష్ట సేవలు, అంకితభావం, విద్యార్థుల భవిష్యత్తుకు చేసిన కృషి, మరియు పాఠశాల స్వచ్ఛతకు గుర్తింపుగా ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఫౌండేషన్ ఫౌండర్ & నేషనల్ చైర్మన్ డా.చక్రవర్తి తెలిపారు. వారికి ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు అభినందనలు తెలిపారు.







