సంగారెడ్డి, 12 September
సంగారెడ్డి పట్టణంలోని బాలసదన్‌లో రోటరీ క్లబ్ ఆఫ్ మంజీరా ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు పోషక విలువలు కలిగిన ఆహార వస్తువులను పంపిణీ చేశారు. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి అవసరమైన పోషకాహార పదార్థాలను అందజేశారు.
సంగారెడ్డి, సెప్టెంబర్ 12: సంగారెడ్డి పట్టణంలోని బాలసదన్‌లో రోటరీ క్లబ్ ఆఫ్ మంజీరా ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు పోషక విలువలు కలిగిన ఆహార వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి అవసరమైన పోషకాహార పదార్థాలను అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షుడు సిహెచ్.అంజయ్య మాట్లాడుతూ.. బాల సదన్‌లోని ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా, ఆనందంగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థులకు చదువుతో పాటు మంచి ఆరోగ్యం, పోషకాహారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. సమాజంలో అవసరమైన వారికి రోటరీ క్లబ్ ఎల్లప్పుడూ తనవంతు సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కార్యదర్శి కమలాకర్ రాజు, కోశాధికారి, మండల విద్యాధికారి డి.అంజయ్య, సభ్యులు దినేష్, సురేష్, మాణయ్య, సత్యనారాయణ చౌహాన్, బాలసదన్ నిర్వాహకురాలు విజయకుమారి, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ రత్నం తదితరులు పాల్గొన్నారు.











