సంగారెడ్డి, 11 September
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక ప్రతిమల వినియోగాన్ని ప్రోత్సహించాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (పీసీబీ) ఈఈ విజయలక్ష్మి సూచించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఆమె అదనపు కలెక్టర్లు సంగీత, పాండులకు మట్టి వినాయక ప్రతిమలను అందజేశారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక ప్రతిమల వినియోగాన్ని ప్రోత్సహించాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (పీసీబీ) ఈఈ విజయలక్ష్మి సూచించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం అదనపు కలెక్టర్లు సంగీత, పాండులకు పీసీబీ ఈఈ విజయలక్ష్మి మట్టి వినాయక ప్రతిమలను అందజేశారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ప్రతిమలకు బదులుగా మట్టి వినాయక ప్రతిమలను వినియోగించాలని కోరారు. మట్టి ప్రతిమలను పూజించడం వల్ల నీటి కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించవచ్చన్నారు. ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై మరింత అవగాహన కల్పించేందుకు పీసీబీ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ పర్యావరణహిత పద్ధతులను పాటించి మట్టి వినాయక ప్రతిమలను వినియోగించాలని విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు.












