సంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్ రామ్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఒక ప్రైవేట్ కళాశాలకు సానుకూల నివేదిక ఇచ్చేందుకు ఆయన రూ.50 వేలు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా రూ.30 వేలు ఇప్పటికే తీసుకున్నారు.
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇంటర్మీడియట్ అధికారి (అక్షర వేకువ): సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలను తనిఖీ చేసి పాజిటివ్ రిపోర్టు ఇచ్చేందుకు రూ.50 వేల లంచం డిమాండ్ జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్ రామ్ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్లోని జిల్లా ఇంటర్మీడియట్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ఓ ప్రైవేట్ కళాశాల ఇన్స్పెక్షన్ నిర్వహించి పాజిటివ్ రిపోర్టు ఇచ్చేందుకు అధికారి రూ.50 వేల లంచం డిమాండ్ ట్లు తెలిపారు. ఇందులో భాగంగా గత వారం బాధితుడు రూ.30 వేల నగదును అధికారికి అందజేశారని, మిగిలిన రూ.20 వేల కోసం అధికారి ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని కోరడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారని అన్నారు. దీంతో ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్లో వల పన్నారు. బాధితుడు రూ.20 వేల నగదును ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలోని అధికారులు గోవింద్ రామ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ట్లు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ పేర్కొన్నారు.


