సారంగాపూర్ మండల సర్పంచ్ల సంఘం నూతన కార్యవర్గం శనివారం ఏకగ్రీవంగా ఎన్నికైంది. మండలంలోని సర్పంచ్ల సమక్షంలో జరిగిన సమావేశంలో నూతన కమిటీని ఎంపిక చేశారు.
నూతన కార్యవర్గంలో మంతెన గంగారెడ్డి అధ్యక్షులుగా, కునేరు భూమన్న గౌరవ అధ్యక్షులుగా, కరిపే రవలి విలాస్ ప్రధాన కార్యదర్శిగా, జాదవ్ దిలీప్ ఉపాధ్యక్షులుగా, ఆడే పంచి బాయి దిలీప్ మీడియా ఇంచార్జ్‌గా, రాథోడ్ గవస్కర్ కోశాధికారిగా ఎన్నికయ్యారు.
నూతన అధ్యక్షులు మంతెన గంగారెడ్డి మాట్లాడుతూ, మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి, సర్పంచ్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, గ్రామాల సమగ్రాభివృద్ధికి పాటుపడతామని అన్నారు.
గౌరవ అధ్యక్షులు కునేరు భూమన్న సర్పంచ్‌లందరూ ఐక్యంగా ఉండి మండల అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మండలంలోని సర్పంచ్‌లు, నూతన కమిటీ సభ్యులను పలువురు అభినందించారు.










