మంచేరియల్, 2026-11-22
ప్రతి ఏటా మండలమకరవిళక్కు సీజన్లో పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళ్తుంటారు.
ప్రతి ఏటా మండలమకరవిళక్కు సీజన్లో పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో, చెంగన్నూర్, తిరువల్ల, కొట్టాయం స్టేషన్ల ద్వారా యాత్ర సాగించే భక్తులకు రైలు సౌకర్యాలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు.
బెల్లంపల్లి, మంచిర్యాల స్టేషన్లలో 12626 కేరళ ఎక్స్ప్రెస్, 16318 హింసాగర్ ఎక్స్ప్రెస్ రైళ్లకు, అలాగే పెద్దపల్లి స్టేషన్లో 22647 కోర్బాతిరువనంతపురం నార్త్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కు అదనపు హాల్టులు కల్పించాలని లేఖలో ప్రతిపాదించారు.
ఈ అదనపు స్టాపేజీలు కల్పిస్తే వేలాది మంది యాత్రికులకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడటంతో పాటు సమయం, ఖర్చులు ఆదా అవుతాయని పేర్కొన్నారు.
ఈ ప్రతిపాదనను పరిశీలించి, రైల్వే బోర్డు, దక్షిణ మధ్య రైల్వే అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.







