ఎస్సార్పీ ఓసీపీ, శ్రీరాంపూర్, పెద్దపల్లి, తెలంగాణ (అక్షరవేకువ) సెప్టెంబర్ 14
శ్రీరాంపూర్ డివిజన్ ఎస్సార్పీ ఓసీపీలో ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కన్వేయన్స్ డ్రైవర్‌ను, కొత్త టెండర్ వచ్చిందనే నెపంతో ఎలాంటి సమాచారం లేకుండా తొలగించడం దారుణమని డ్రైవర్ల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. ఈ అక్రమ తొలగింపులపై కనీస వేతనాల మండలి చైర్మన్ జనక్ ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు.
కన్వేయన్స్ డ్రైవరును అకారణంగా తొలగించడం అన్యాయం: కనీస వేతనాల మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ వినతి శ్రీరాంపూర్ డివిజన్ ఎస్సార్పీ ఓసీపీలో గత ఎనిమిదేళ్లుగా ప్రాజెక్ట్ ఇంజనీర్ వాహనంపై విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కన్వేయన్స్ డ్రైవర్‌ను, కొత్త టెండర్ వచ్చిందనే నెపంతో ఎలాంటి సమాచారం లేకుండా తొలగించడం దారుణమని డ్రైవర్ల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ డ్రైవరు కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ INTUC జనరల్ సెక్రెటరీ జీవన్ జోయల్ ఆధ్వర్యంలో కనీస వేతనాల మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ వినతిపత్రం అందజేశారు. ఈ సమస్యపై చైర్మన్ సానుకూలంగా స్పందిస్తూ, బాధితుడికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సంఘం నాయకులు మాట్లాడుతూ, భూనిర్వాసితుల ఉపాధి కోసం ఉద్దేశించిన కన్వేయన్స్ టెండర్లలో గుడ్‌విల్ పేరిట సిండికేట్‌గా మారి, నిబంధనలకు విరుద్ధంగా ఏళ్ల తరబడి పనిచేస్తున్న డ్రైవర్లను అకారణంగా తొలగిస్తున్నారని మండిపడ్డారు. డ్రైవర్ల అక్రమ తొలగింపులను ఆపకపోతే ఆందోళనలకు సిద్ధమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కన్వేయన్స్ డ్రైవర్ల సంఘం (SCKIS-CTU) శ్రీరాంపూర్ డివిజన్ అధ్యక్షులు కాసీపేట రాజేశం, పిట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ పత్తి రాజలింగు, ప్రచార కార్యదర్శి కలవేని సతీష్ కుమార్, శశిధర్, మల్లేష్, అనిల్, అసల మల్లేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.

