నిర్మల్ జిల్లాలో అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు అందజేయడమే లక్ష్యమని టీయూడబ్ల్యూజే (TUWJ) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొండూరి రవీందర్, వెంకగారి భూమయ్య స్పష్టం చేశారు. జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి (DPRO) విష్ణువర్ధన్, యూనియన్ నాయకత్వ ఆధ్వర్యంలో జిల్లాలో అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది.
మొదటి విడతలో కార్డులు అందని జర్నలిస్టులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, వారం రోజుల్లోగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, రెండో విడత జాబితా ద్వారా మిగిలిన వారందరికీ కార్డులు అందజేస్తామని వారు భరోసా ఇచ్చారు. కొందరి కార్డులు సాంకేతిక కారణాల వల్ల పెండింగ్లో ఉన్నాయని, ఎవరికీ అన్యాయం జరగదని తెలిపారు.
ప్రభుత్వంపై నిరంతర ఒత్తిడి తీసుకువచ్చి, నిబంధనల్లో మార్పులు చేయిస్తూ అర్హులైన ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు దక్కేలా యూనియన్ విజయం సాధించిందని నాయకులు గుర్తుచేశారు. ఈ ప్రక్రియలో భాగంగానే అర్హులైన జర్నలిస్టులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.
మొదటి జాబితాలో పేరు లేని మిత్రులు ఎవరూ ఆందోళన చెందవద్దని, రెండో జాబితాలో కచ్చితంగా అందరికీ కార్డులు వస్తాయని జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొండూరి రవీందర్, వెంకగారి భూమయ్య జర్నలిస్టులకు విజ్ఞప్తి చేశారు. అర్హులందరికీ న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.











