మునిపల్లి, 2023-08-29
నేటి విద్యార్థులకు విద్యతో పాటు శారీరక అభివృద్ధి కూడా ఎంతో ముఖ్యమని, విద్యార్థుల సమగ్ర వికాసంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని శేరిలింగంపల్లి రీజియన్ కార్యదర్శి లయన్ మంగళపర్తి వెంకటేశం, అమీన్పూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ కట్లె సిద్దిరాములు అన్నారు. విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు అమీన్పూర్ లయన్స్ క్లబ్ చేస్తున్న కృషి అభినందనీయం.
నేటి విద్యార్థులకు విద్యతో పాటు శారీరక అభివృద్ధి కూడా ఎంతో ముఖ్యమని, విద్యార్థుల సమగ్ర వికాసంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని శేరిలింగంపల్లి రీజియన్ కార్యదర్శి లయన్ మంగళపర్తి వెంకటేశం, అమీన్పూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ కట్లె సిద్దిరాములు అన్నారు. విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు అమీన్పూర్ లయన్స్ క్లబ్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ముఖ్యంగా విద్యార్థుల క్రీడాభివృద్ధికి కృషి చేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులు కే.నాగరాజు, కే.కరుణాకర్ రెడ్డిలను వారు అభినందించారు.
భారతీయ హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అమీన్పూర్ ఆధ్వర్యంలో మునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం క్రీడా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు సి.హెచ్. కల్పన అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో దాతలు, ప్రోగ్రామింగ్ చైర్మన్ లయన్ కూర నాగరాజు, కో-చైర్మన్ మునిపల్లి రమేష్ సౌజన్యంతో వివిధ క్రీడా పోటీలు నిర్వహించి, విజేతలకు కప్‌లు, మెమెంటోలు, పతకాలు, సర్టిఫికెట్లతో పాటు క్రీడా సామగ్రిని అందజేశారు.
ఈ కార్యక్రమంలో అమీన్పూర్ క్లబ్ అధ్యక్షుడు లయన్ కే. సిద్దిరాములు, కార్యదర్శి లయన్ కే.కరుణాకర్ రెడ్డి, కోశాధికారి కే.నాగరాజు, పాస్ట్ లయన్స్ జోన్ చైర్మన్ బి.కృష్ణాగౌడ్, లయన్స్ పి.సురేందర్, జి.లింగం, పి. రమాకాంత్, ఉపాధ్యాయులు పి.శ్రీవిద్య, ఎం.శైలజ తదితరులు పాల్గొన్నారు.












