తలమడుగు, 2026-11-24
తలమడుగు మండలం భరంపూర్ లో అడవి పందులను విద్యుత్ తీగలతో వేటాడిన ఘటనలో ఇద్దరిపై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితులను రిమాండుకు తరలించారు.
ఇచ్చోడా డివిజనల్ అటవీశాఖ అధికారులు విద్యుత్ తీగలు అమర్చి అడవి పందులను వేటాడిన ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఇబ్రహీం షరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం, తలమడుగు మండలం భరంపూర్ కి చెందిన రాజేష్, సిడం రామారావు విద్యుత్ తీగలు అమర్చి 3 అడవి పందులను వేటాడారని తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి వారిని రిమాండుకు తరలించామని ఆయన పేర్కొన్నారు.

