Manchiryala, 2026-11-24
యువతను మత్తు పదార్థాలు, వ్యసనాలకు దూరంగా ఉంచి వారి భవిష్యత్తును భద్రపరచడం అందరి బాధ్యత అని, దీనికి అవగాహన కల్పించేందుకు పోస్టర్లను ఆవిష్కరించామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.
దేశానికి యువతే అతిపెద్ద బలం. వ్యసనాల బారిన పడకుండా వారి భవిష్యత్తును కాపాడటం అభివృద్ధి చెందిన సమాజ నిర్మాణానికి కీలకం. యువతను మత్తు పదార్థాలు, వివిధ వ్యసనాలకు దూరంగా ఉంచి వారి భవిష్యత్తును భద్రపరచడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. యువతలో వ్యసనాలపై అవగాహన పెంపొందించి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ మహత్తర కార్యక్రమంలో పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ఎన్ఎస్ఎఫ్, యువజన రెడ్ క్రాస్, ఇతర సామాజిక సంస్థలు, సంఘ నాయకులు చురుకుగా భాగస్వాములు కావాలని ఆయన సూచించారు.
వ్యసనాల నివారణపై ప్రజల్లో, యువతలో అవగాహన కల్పించేందుకు రూపొందించిన పోస్టర్లను మంచిర్యాల జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షులు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఐఏఎస్ చేతుల మీదుగా విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్, డీసీపీ, ఏసీపీ, బెల్లంపల్లి డివిజన్ సబ్ కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.






