మంచిర్యాల (అక్షరవేకువ) సెప్టెంబర్ 27
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ మహిళా శక్తి పథకం ద్వారా 375 కుట్టు మిషన్లను జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అధికారులతో కలిసి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని షాదీఖానా మైనారిటీ ఫంక్షన్ హాల్లో పంపిణీ చేశారు.
నియోజకవర్గంలోని ముస్లిం మహిళలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ మహిళా శక్తి పథకం ద్వారా 375 కుట్టు మిషన్లను జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అధికారులతో కలిసి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని షాదీఖానా మైనారిటీ ఫంక్షన్ హాల్లో పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ, మహిళలు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం అందిస్తున్న ఈ సహకారం మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు కుటుంబ ఆర్థిక స్థిరత్వానికి తోడ్పడుతుందని తెలిపారు.
అనంతరం మైనారిటీ జిల్లా అధ్యక్షులు, కార్పొరేటర్ ఖలీద్, ముస్లిం మహిళలు సురేఖ ను శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, లక్షెట్టిపేట్ మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి-నర్సయ్య, జిల్లా మెంబర్ అంకతి శ్రీనివాస్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, జిల్లా అధ్యక్షులు పూదరి తిరుపతి, జిల్లా అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, లక్షెట్టిపేట్ పట్టణ అధ్యక్షులు సయ్యద్ షాహిద్ అలీ, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, మైనారిటీ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.












