అడెల్లి (అక్షరవేకువ) జూలై 04
సారంగాపూర్ మండలం అడెల్లి గ్రామంలో రూ. 90 లక్షల కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. ఈ నిధులతో గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం వంటి పనులు జరగనున్నాయి.
సారంగాపూర్ మండలం అడెల్లి గ్రామంలో రూ. 90 లక్షల కేంద్ర ప్రభుత్వ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. ముందుగా గ్రామంలోని ప్రసిద్ధ ఆలయం మహా పోచమ్మ వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా గ్రామంలో రూ. 50 లక్షలతో నూతన సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణానికి, రూ. 40 లక్షలతో అడెల్లి తండాలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి, పలు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గ్రామపంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, మహిళా స్వయం సహాయక సంఘాల భవనాలు, అగ్రికల్చరల్ గోదాం, సీసీ రోడ్లు, డ్రైనేజీలు వంటి అనేక కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులను మరింత బలోపేతం చేసేందుకు నిరంతరం కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, ముత్యం రెడ్డి, మేడిసెమ్మ రాజు, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, జిల్లా ప్రధాన కార్యదర్శి కరిపే విలాస్, మండల అధ్యక్షులు కాల్వ నరేష్, మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అడెల్లి గ్రామ సర్పంచ్ సాయన్న, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు మరియు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.












