మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై స్వపక్ష, విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల పుట్టినరోజు సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై రాజకీయంగా ప్రతిస్పందనలు వస్తున్నాయి. కాంగ్రెస్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
470 కోట్ల బ్యాంకు రుణాల చెల్లింపునకు సమాధానం ఇవ్వలేకే మతి భ్రమించిన వాక్యాలు చేస్తున్నారని, కాంగ్రెస్ హైకమాండ్‌తో పాటు ప్రతిపక్షాలకు సరైన సమాధానం ఇవ్వలేక ఎమ్మెల్యే ఇబ్బంది పడుతున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఎంపీ వంశీ గెలుపు కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలది కాదని, పెద్దపల్లి కాకవెంకటస్వామి అభిమానులు, విశాఖ ట్రస్ట్ సేవ సభ్యులు ఉన్నారని, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్‌లలో కాకుండా పెద్దపల్లిలో గెలుపు ఎందుకు సాధ్యమైందో గుర్తించాలని ఆయన సూచించారు. కాకా వెంకటస్వామి సేవలు పెద్దపల్లిలో ఉన్నాయని, దానివల్లే ఎంపీ స్థానం గెలిచారని అన్నారు.
అలాగే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథరావు ప్రెస్ మీట్లో ఆసక్తికర విషయాలను ఆరోపించారు. ఎంపీ ఎన్నికల్లో 10 కోట్లు తీసుకొని ఎమ్మెల్యే ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టడం నిజం కాదా అని ప్రశ్నించారు. దమ్ముంటే ఆ విషయం బయట పెట్టాలని అన్నారు. మంచిర్యాల ప్రజలను అభివృద్ధి, సంక్షేమం నుంచి దృష్టి మరల్చడానికి కాంగ్రెస్‌లో ప్లెక్సీలు, ర్యాలీల పంచాయతీ, దళిత పంచాయతీ తీసుకువచ్చి వివాదం చేయడం మంచిర్యాల నేతలకే చెల్లిందన్నారు. మంత్రి వివేక్, ఎంపీ వంశీ, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు 6 గ్యారెంటీలు, 420 హామీలను వ్యక్తిగత రాజకీయాలకు వాడుకుంటున్నారని తీవ్రంగా విమర్శించారు.
కాంగ్రెస్‌లో మంత్రి, మంచిర్యాల ఎమ్మెల్యే పి.ఎస్.ఆర్., బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథరావుల వ్యాఖ్యలు హాట్ కామెంట్స్‌గా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.












