మంచిర్యాల నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై అసమ్మతి కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు. ఆట కట్టిస్తా, తాటతీస్తా అంటూ త్వరలోనే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎన్నికల హామీల మేరకు చేపట్టిన 5000 కోట్ల అభివృద్ధి పనుల వివరాలను త్వరలో వెల్లడిస్తానని తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల క్రమంలో ఇచ్చిన మాట మేరకు, 5000 కోట్ల అభివృద్ధి పనులలో పూర్తి వివరాలతో ఏప్రిల్ మాసంలో మంచిర్యాల నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల లెక్కలను క్లుప్తంగా వివరిస్తానని తెలిపారు. తాను ఇచ్చిన మాట దాటే విధంగా అభివృద్ధి పనులు జరిగాయని, ఈ క్రమంలోనే రుణ శేషం, శత్రు శేషం రెండింటికీ సమాధానం ఉంటుందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట మేరకు 5000 కోట్ల రుణ శేషం దాటిందని, ఇక శత్రుశేషమే మిగిలిందని ప్రతిపక్షాలతో పాటు అసమ్మతి వర్గంగా ఏర్పడ్డ జగన్ సీనియర్ కాంగ్రెస్ నేత మీడియా ప్రచురితంపై 10మంది కార్పొరేటర్లు మరో 10మంది ఊహాగానాలపై మండిపడ్డారు.త్వరలోనే లెక్కలు తేలుస్తానని, ఆట కట్టిస్తామని తాటతీస్తా మనీ హెచ్చరించారు. ఈ క్రమంలో మీడియా పాత్రపై సైతం పలు ప్రశ్నలను ఎమ్మెల్యే లేవనెత్తారు. ఏది ఏమైనా, అంతర్గత యుద్ధంగా కాంగ్రెస్లో అలజడి మొదలయ్యేలా ఎమ్మెల్యే వ్యాఖ్యలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.












