దసరా పండుగ సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ చిన్నపాపని కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపి, ఘనంగా సన్మానించారు.
దసరా పండుగ సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ చిన్నపాపని కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపి, ఘనంగా సన్మానించారు.
విజయదశమి పర్వదినం ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలు నింపాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దసరా పండుగ ప్రతి ఒక్కరికీ విజయాలను అందించాలని అన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావుతో ఆత్మీయంగా మాట్లాడి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గుమ్మడిదల మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు చక్రపాణి, కుమార్ గౌడ్, హుస్సేన్, వెంకట్ రామ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సత్యనారాయణ, శేఖర్ రెడ్డి, మహేష్, ఫయాజ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.






