రాష్ట్రంలో రైతులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే, వాటిని పరిష్కరించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పసలేని కార్యక్రమాలతో కాలయాపన చేస్తోందని కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు గోపతి రాజయ్య విమర్శించారు. (ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ) అంశంపై అనవసరంగా రాద్ధాంతం చేస్తూ ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.
రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో రైతులను ఆదుకోవాల్సిన రాష్ట్ర మంత్రివర్గం, ఎమ్మెల్యేలు ఢిల్లీలో పర్యటిస్తూ సమయాన్ని వృథా చేస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు, ప్రాజెక్టుల ద్వారా పంటలకు సాగునీరు అందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయకపోవడం వల్ల రైతులకు నష్టం జరుగుతోందని ఆయన విమర్శించారు. అలాగే రైతు బీమా ప్రీమియం చెల్లింపుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, రైతు బీమా పునరుద్ధరణకు సంబంధించి ఆగస్టు నెలలోనే చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు స్పందన లేదని ఆయన ఆరోపించారు. దీంతో రైతులు మరణించిన సందర్భాల్లో వారి కుటుంబాలకు బీమా సొమ్ము అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా కేవలం రాహుల్ గాంధీ మెప్పు పొందేందుకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కు వ్యతిరేకంగా కాంగ్రెస్ బురదజల్లే ప్రయత్నం చేస్తోందని ఆయన అన్నారు.
దీపావళి సందర్భంగా రామ్లీలా మైదానంలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే వ్యాపారులు, మర్చంట్ అసోసియేషన్ ప్రతినిధులు తర్వాత కార్యక్రమం నిర్వహించుకోవాలని సూచించినప్పటికీ, పట్టించుకోకుండా వ్యాపారుల జీవనోపాధికి ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆయన ఆరోపించారు. దాదాపు రూ.10 వేల కోట్ల వ్యాపార లావాదేవీలు జరిగే మైదానాన్ని నిర్బంధించవద్దని కోరినా కాంగ్రెస్ నాయకులు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో కేవలం ఒక స్థానానికే పరిమితమైనప్పటికీ కాంగ్రెస్ నాయకత్వానికి బుద్ధి రావడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ఎర్రం విజయేందర్, వనపర్తి రాకేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎంబడి సురేందర్, కర్ణాల కిషన్, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి కారుకూరి తిరుపతి, జిల్లా టూర్ కన్వీనర్ లక్కాకుల బుచ్చన్న, జిల్లా కార్యవర్గ సభ్యులు గొల్ల మల్లేష్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు గుర్రం రాజన్న, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడు గురు ప్రసాద్, శక్తి కేంద్ర ఇన్ఛార్జిలు రాస శ్రీనివాస్, సిపిరిశెట్టి శ్రీనివాస్, మామిడిపల్లి వార్డు సభ్యుడు నలిమెల సుధీర్ వర్మ, బూత్ అధ్యక్షుడు కామచంద్రయ్య, సీనియర్ నాయకులు టేకుమట్ల గురువయ్య, స్వర్గం శంకరయ్య, కర్ణాల అశోక్, దికొండ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

