జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజున ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ నెల 11వ తేదీన జరగనున్న పోలింగ్ రోజున అర్హత గల ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.
ఎన్నికల కోసం నోటిఫై చేయబడిన ప్రాంతాలలో పని చేసే ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించడం జరిగిందని ఆయన చెప్పారు.
అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలకు స్థానిక సెలవు ప్రకటించడం జరిగిందని ఆయన వివరించారు.
పోలింగ్ నిర్వహణ కోసం ప్రభుత్వ భవనాల విద్యా సంస్థలకు స్థానిక సెలవులు ఉపయోగించబడతాయని ఆయన పేర్కొన్నారు.











