Krishna/Avanigadda Rural (అక్షరవేకువ) జూలై 12
ఈ నెల 14వ తేదీ మంగళవారం నాడు కేంద్ర గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి, రాష్ట్ర బిజెపి అధ్యక్షులు రామచంద్ర రావు మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. కేంద్ర మంత్రి తాడిచర్ల టు కోల్ బ్లాక్ సింగరేణి కేటాయింపు అనంతరం మొదటిసారిగా ఎస్ఆర్పి 3 మైన్ను సందర్శిస్తారు.
ఈ నెల 14వ తేదీ మంగళవారం రోజున కేంద్ర గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి, రాష్ట్ర బిజెపి అధ్యక్షులు రామచంద్ర రావు మంచిర్యాల జిల్లా పర్యటనకు రానున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాడిచర్ల టు కోల్ బ్లాక్ సింగరేణికి కేటాయించిన అనంతరం మొదటిసారిగా జిల్లాలోని ఎస్ఆర్పి 3 మైన్ను మధ్యాహ్నం రెండు గంటలకు సందర్శిస్తారు.
అనంతరం మూడు గంటలకు ఎమ్మెన్నార్ గార్డెన్లో సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులతో పాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో సమావేశంలో పాల్గొంటారు. ఈ పర్యటనలో వారితో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షులు వేరబెల్లి రఘునాథ్, ఎమ్మెల్సీ అంజి రెడ్డి, రాష్ట్ర నాయకులు పాల్గొంటారు.
కావున జిల్లాలోని భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరుగుతోందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ తెలిపారు.










