మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 02
చూధోడూోదుతోఅదశచుుఅత()ుతీథోతచశు.చటటచభతుుడుతుఇబబదుుచదీశు.
మంచిర్యాల రూరల్ పరిధిలోని రాయగడ్పూర్ గ్రామంలో దుర్గామాత ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఎమ్మెల్యే పిఎస్ఆర్ (ప్రేమ సాగరం) ఎసిసి నిర్వాహకులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చేపట్టిన చర్యల వల్ల భక్తులు పడుతున్న ఇబ్బందుల గురించి నిలదీశారు. గ్రీన్ సిటీలో ఏర్పాట్లతో పాటు ఆండాలమ్మ కాలనీలో భక్తులకు రూట్ డైవర్షన్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టాలని, నిర్వాహకులుగా తమకు బాధ్యత లేదని దుయ్యబట్టారు.
స్థలాల స్వాధీనంపై ఎమ్మెల్యే ప్రకటన
ఈ నేపథ్యంలో, కంపెనీ మూతపడ్డ కారణంగా అగ్రిమెంట్తో ఒప్పందాన్ని వినిపించారు. కంపెనీ ప్రస్తుతం మూతపడి ఉన్నందున ఎలాంటి హక్కులు లేవని, కంపెనీ పరిధిలో ఉన్న ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకుని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తానని వెల్లడించారు.
బ్రిడ్జి పనులకు స్టేపై ఆగ్రహం
భక్తుల సౌకర్యార్థం 10 కోట్లతో కొత్త బ్రిడ్జిని ఏర్పాటు చేసి, పిల్లర్ల పనులు జరుగుతున్న సమయంలో ఎసిసి నిర్వాహకులు హైకోర్టులో కేసు వేసి స్టే తీసుకురావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పహరి గోడ తొలగింపు హెచ్చరిక
అవసరమైతే కంపెనీ పహరి హద్దులను తొలగించి పేదలకు స్థలాల పంపిణీ చేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. క్వారీ జాతర నిర్వాకంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.











