మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 16
మంచిర్యాల జిల్లాలో భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్తేజం కనిపిస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్ ల పర్యటన పార్టీ నేతలకు నూతన జోష్ ను అందించింది. ఈ పర్యటన అనంతరం బిజెపి నేతలు మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతున్నట్లు సమాచారం.
మంచిర్యాల జిల్లాలో భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం నెలకొంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్ ల పర్యటన పార్టీ నేతలకు కొత్త జోష్ ను అందించింది. ఈ పర్యటన అనంతరం బిజెపి నేతలు మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు.
సింగరేణి భరోసా యాత్ర పార్టీకి కలిసి వచ్చిన మైలేజ్ గా నిలిచింది. మంచిర్యాల, చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గాలను కైవసం చేసుకునేందుకు బిజెపి వ్యూహాలు రచిస్తోంది. ఇందుకోసం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ క్రమంలో, రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుర్గం అశోక్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు.












