మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 07
జటజఎట.ఒటడట,హ,ఖడడషట.
మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకోనున్నాయి. కొత్త నేత ఒకరు పార్టీలోకి ప్రవేశించడంతో పాటు, మంత్రి సహకారంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పలువురు చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే 20 మంది కార్పొరేటర్లు పార్టీకి మద్దతు తెలుపుతూ, దాని బలోపేతానికి కృషి చేస్తున్నట్లు తెలిసింది.
వర్గాల మధ్య పోరు
జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ చీలిక దిశగా అడుగులు వేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వివిధ వర్గాల మధ్య పోటాపోటీ నెలకొంది. హైదరాబాద్ కేంద్రంగా ఈ పరిణామాలపై మంతనాలు జరుగుతున్నాయి.
పక్కా ప్రణాళికతో ముందుకు
ఎమ్మెల్యే వ్యతిరేక వర్గాలు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయి. ఇటీవల జరిగిన మాటామంతీ నేపథ్యంలో, త్వరలోనే ఈ పథకం పట్టాలు ఎక్కేలా మార్గం సుగమం చేస్తున్నట్లు సమాచారం.











